Top Image

PRESIDENT MESSAGE

మీ మిత్రుడు,శ్రేయోభిలాషి,మన ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం , అధ్యక్షుడు అర్జున్ అనంతుల, ఆస్టిన్ తెలుగు వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ,మీ అందరికీ నా తరపున , మా కార్యవర్గ సభ్యుల తరుపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

2023 సంవత్సరంలో అందరికీ శుభ సంవత్సరం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

President Message

మీ ప్రోత్సాహానికి, సహకారానికి నా కృతజ్ఞతలు…

‘నీ ఉత్తమ విలువలను గుర్తించడానికి అత్యంత సులువైన మార్గం, సమాజ సేవలో పడి నిన్ను నీవు మరచిపోవడమే’

మీ మిత్రుడు,శ్రేయోభిలాషి,మన  ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం , అధ్యక్షుడు అర్జున్ అనంతుల, ఆస్టిన్  తెలుగు వారందరికీ పేరు పేరున నమస్కారాలు  తెలియజేస్తూ,మీ అందరికీ నా తరపున , మా కార్యవర్గ సభ్యుల తరుపున  నూతన సంవత్సర  మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.  

2023 సంవత్సరంలో అందరికీ శుభ సంవత్సరం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

నా మీద  నమ్మకంతో 2023 సంవత్సరం ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం  అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన  మా కార్యవర్గ సభ్యులకు (EC),  ధర్మకర్తల మండలికి (BOD), నాకు అడుగడుగునా సహాయం అందిస్తూ, ప్రోత్సహిస్తున్న దాతలకు, మిత్రులకు , వాలంటీర్లకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.  

కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలతో, వినూత్న కార్యక్రమాలతో, 2023 ఒక చిరస్మరణీయమైన సంవత్సరముగా ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక కార్యవర్గ సభ్యులు
 కలిసి కట్టుగా  కృషి చేస్తామని   హామీ ఇస్తున్నాను.

ప్రతిష్టాత్మకమైన మన ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం  నిరంతరం మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలని ప్రోత్సాహిస్తూ భావితరానికి మార్గదర్శిగా స్పూర్తినిచ్చే దిశగా అడుగులేస్తూ 32 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, ఇందుకు ప్రధాన కారకులయిన నాయకులకి, దాతలకి, స్వచ్ఛందంగా సేవలందిస్తున్న కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు.

ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం నిర్వహించే కార్యకలాపాల్లో ఎల్లప్పుడూ మహిళా శక్తికి, సాధికారికతకు పెద్ద పీఠ వేస్తూనే వుంది. అదే పరంపరను కొనసాగిస్తూ, ఆస్టిన్  తెలుగు మహిళలందరూ  తెలుగు  సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు చేయూత నివ్వాలని విజ్ఞప్తి.

ఆస్టిన్  యువ శక్తిని గుర్తిస్తూ, వారే మన సంస్కృతికి వారసులని భావిస్తూ, యువతీ యువకులు అందరూ ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం  చేపట్టిన  కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుకొంటున్నాము.
 
మీ అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఆస్టిన్  తెలుగు  సాంస్కృతిక సంఘం    అధ్యక్షుడిగా తెలుగు భాషకి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు మరియు మరెన్నో   వినూత్న కార్యక్రమాలతో  ఆస్టిన్  తెలుగు వారందరిని అలరించి, ఆనందింప చేస్తానని, తెలుగు  సాంస్కృతిక సంఘం  అభివృద్ధికి నా వంతు ప్రయత్నం, కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.

భవదీయుడు,
అర్జున్ అనంతుల
అధ్యక్షులు
తెలుగు  సాంస్కృతిక సంఘం
ఆస్టిన్ ,టెక్సస్.

 

Grand Sponsors

GOLD Sponsors

Silver Sponsors